HomeTelangana

‘మోడీ, రాహుల్, కేసీఆర్ ను ఎదిరించే శక్తి నాకు మాత్రమే ఉంది, బీఆరెస్ మంత్రులు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు’

‘మోడీ, రాహుల్, కేసీఆర్ ను ఎదిరించే శక్తి నాకు మాత్రమే ఉంది, బీఆరెస్ మంత్రులు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు’

ఆయన పేరు వింటే సినిమాల్లో కామెడీ నటులు గుర్తుకు వస్తారు. ఆయనను , ఆయన చేష్టలను చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఆయన ఒకప్పుడు ప్రజలకు దేవుని వాక్యాలు

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న AI కేసీఆర్
మాజీ నక్సలైటు సీతక్కపై పోటీకి మరణించిన నక్సలైటు కూతురును దింపిన కేసీఆర్
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్

ఆయన పేరు వింటే సినిమాల్లో కామెడీ నటులు గుర్తుకు వస్తారు. ఆయనను , ఆయన చేష్టలను చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఆయన ఒకప్పుడు ప్రజలకు దేవుని వాక్యాలు వినిపించేవాడు కానీ ఇప్పుడు మాత్రం ప్రతీ రోజూ రాజకీయ వ్యాఖ్యానాలతో అదరగొడుతున్నాడు. త్వరలోనేను ముఖ్యమంత్రి అయిపోతానంటాడు…. తలుచుకుంటే ప్రధానిని కూడా అవుతానంటాడు…ప్రపంచ అగ్రరాజ్యాల అధ్య‌క్షులంతా తన ఎన్నికల ప్రచారం కోస‍ం వస్తారని ఘంటా భజాయిస్తాడు. మొత్తానికి ఆయన రోజూ కష్టాలతో సతమతమయ్యే ప్రజ‌జలకు అతి సీరియస్ గా మంచి ఎంటర్ టైన్ మెంట్ పంచుతాడు.

ఆయన పేరు కేఏ పాల్. ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. తెలంగాణ్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా తానున్నానంటూ వాలిపోతాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో తానే గెలుస్తున్నానని, ఆ తర్వాత ఇక ముఖ్యమంత్రి అయిపోవడమే అని ప్రకటించే అమాయకత్వమో, ధైర్యమో ఉన్న వ్యక్తి ఆయన. ఆయన ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు.

తాను సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టానని, చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి తాను డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి నా చారిటీ మూయించారని ఆరోపించారు కేఏ పాల్. అయినా జగ్గారెడ్డిని ఇప్పటి వరకు క్షమించాను. కానీ ఇక ఇప్పుడు తన పార్టీలో చేరకపోతే క్షమించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ” వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరుతావా? అభివృద్ధి చేసే నా పార్టీలో చేరతావా?” అని కేఏ పాల్ జగ్గారెడ్డిని ప్రశ్నించారు.

గద్దర్ బతికున్నంతకాలం ఎన్నడూ పట్టించుకోను కేసీఆఱ్ ఆయన చనిపోయాక అక్కడ వాలిపోయాడు అని విమర్శించాడు కేఏ పాల్. రేవంత్ రెడ్డికి ఆరెస్సెస్ తో సంబంధం ఉన్నందువల్లే, సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని కేఏ పాల్ ఆరోపించారు.

మోడీ, కేసీఆర్, రాహుల్‌ని ఢీ కొట్టే శక్తి నాకు మాత్రమే ఉంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్‌లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని ఆ మంత్రులు కూడా నమ్ముతున్నారు.’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.