HomeTelangana

తెలంగాణ రైతులకు ఇండిపెండెంట్ ‍డే గిఫ్ట్.. లక్ష లోపు రుణాల మాఫీ

తెలంగాణ రైతులకు ఇండిపెండెంట్ ‍డే గిఫ్ట్.. లక్ష లోపు రుణాల మాఫీ

తెలంగాణ రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు 99,999 వరకు రైతులు పొందిన రుణాలు మాఫీ అవుతాయి.

మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్న కేసీఆర్.. తెరపైకి సమైక్యవాదం
GHMC పరిథిలో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు,ఎల్లుండి సెలవులు
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిది; దాన్ని నిర్మూలించాలి – ఉధయనిధి స్టాలిన్

తెలంగాణ రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు 99,999 వరకు రైతులు పొందిన రుణాలు మాఫీ అవుతాయి.

గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల ఖాతాల్లోకి ఈ సొమ్మును జమ చేయాలని ఆర్థిక శాఖకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తదనుగుణంగా 9.02 లక్షల మంది రైతుల బకాయిలను జమ చేసేందుకు 5,809.78 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దశలవారీగా బకాయిలను క్లియర్ చేస్తోంది. రైతులు పొందిన రుణాల లెక్కింపునకు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేపట్టినా ఏడాదిన్నరగా ఆలస్యమైంది. దీనికి తోడు కోవిడ్-19 మహమ్మారి రావడం, ఆ తర్వాత లాక్‌డౌన్, నోట్ల రద్దు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

తాజా నిర్ణయంతో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులు రుణమాఫీ ప్రక్రియ పరిధిలోకి రానున్నారు. CMO ప్రకారం, ఆర్థిక మంత్రి ,ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు రుణమాఫీని అమలు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించిన 45 రోజుల గడువుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. దీని ప్రకారం బ్యాంకర్లతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆగస్టు3వ తేదీన 62,758 మంది రైతులకు రూ.41,000 లోపు ఉన్న 237.85 కోట్ల రూపాయలను రుణాలను మొదటి విడతగా మాఫీ చేశారు. విడుత‌ల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. మిగతా రైతుల రుణాలను సోమవారం ఒకేసారి రూ.99,999 లోపు ఉన్న 10.79లక్షల మంది రైతుల రూ.6,546.05కోట్లను మాఫీ చేసింది.