2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడి ఎంతకైనా తెగిస్తాడని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ , మాజీ బీజేపీ నేత సత్యపాల్ మాలిక్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడి ఎంతకైనా తెగిస్తాడని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ , మాజీ బీజేపీ నేత సత్యపాల్ మాలిక్ అన్నారు. మళ్ళీ ఏదో ఒకచోట్ అపెద్ద ఎత్తున బాంబులు పేలవచ్చు, పుల్వామా లాంటి దాడులు జరగవచ్చు, బీజేపీ ముఖ్య నేతను ఎవరినైనా హత్య చేయవచ్చు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
“ఈ వ్యక్తులు ఏదైనా అవాంఛనీయ సంఘటన చేస్తారని నేను భయపడుతున్నాను. వారు రామ మందిరంపై దాడికి వ్యూహరచన చేయవచ్చు. బీజేపీ నాయకుడిని చంపేందుకు కుట్ర పన్నారు. పుల్వామా లాంటి దాడి చేయగలరు.” అని ఆయన్ అన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవబోదని, వారిపై ప్రజల్లో చాలా వ్యతిరే3కత ఉందని ఆయన న్నారు. అందుకే హింసాత్మక సంఘటనలు చేసి , వాటిని ఇతరుల మీదికి నెట్టి ఎన్నికల్లో సింపతీ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని మాలిక్ మండిపడ్డారు.
తాజాగా ఆయన హిందీ వెబ్‌సైట్ది వైర్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ , బీజేపీ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయిందని అన్నారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అనుకూల వ్యక్తులకు మోడీ అంటే పడదని, రానున్న ఎన్నికల్లో 200 కంటే ఎంపీ సీట్లు తగ్గితే.. బీజేపీ నాయకులే మోడీని తప్పిస్తారని మాలిక్ అన్నారు. యోగి అనుయాయుల్లో ఒకరు తనతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మేఘాలయ, పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రలలో బీజేపీకి పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
మోడీ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను తన్ అజేబు సంస్థలుగా వాడుకుంటూ ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాడని, అయితే ఈ పద్దతులతో ఎక్కువకాలం అధికారంలోకి రావడం కు7దరదని మాలిక్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు మోడీయే కారణమని, ప్రజల మధ్య చీలికలు తీసుకవచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. బేటీ బచావ్ అనే నినాదాలిచ్చే మోడీ మణిపూర్ లో మహిళలపై దారుణమైన అత్య్చారాలు జరిగితే కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని మాలిక్ మండిపడ్డారు.