HomeNationalCrime

300 మంది యువకులకు భజరంగ్ దళ్ సాయుధ శిక్షణ

300 మంది యువకులకు భజరంగ్ దళ్ సాయుధ శిక్షణ

అస్సాం Assam లోని మంగళ్‌దై Mangaldai పట్టణంలోని ఓ పాఠ శాల Schoool లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ bajarang dal సాయుధ శిక్షణ  Arms Training Camp నిర్వహించింది

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు
బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
ఎన్నికల్లో బీఆరెస్సే గెలుస్తుందని చెప్పేసిన బండి స‍ంజయ్

అస్సాం Assam లోని మంగళ్‌దై Mangaldai పట్టణంలోని ఓ పాఠ శాల Schoool లో రాష్ట్రీయ బజరంగ్ దళ్ bajarang dal సాయుధ శిక్షణ  Arms Training Camp నిర్వహించింది. అధికారం అండతో బహిరంగంగా తుపాకులు చేతబూనిన‌ బహజర్ంగ్ దళ్ గుంపు లవ్ జీహాద్ Love Zihadi పై యుద్దం ప్రకటించారు. భజర‍ంగ్ దళ్ నాయకత్వం 300 యువకులకు తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చింది. ఎలాంటి జంకూ గొంకూ లేకుండా బహిరంగంగా ఈ శిక్షణ జరిగింది. జూలై 27న ప్రారంభమైన ఈ శిక్షణ శిబిరం నాలుగు రోజుల పాటు సాగింది.

ఇంత బహిరంగంగా జరుగుతున్నా పోలీసులకు ఏమీ తెలియకపోవడం ఆశ్చర్యం కాదా ? అయితే భజరంగ్ దళ్ శిక్షణ శిబిరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత తప్పని సరి పరిస్థితుల్లో అధికార బీజేపీ చర్యలు చేపట్టింది.

దాదాపు 300 మంది యువకులు ఆయుధాలు ధరించి శిక్షణ పొందుతున్న ఈ ఘట్నపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆ రాష్ట్ర డీజీపీ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం రాత్రి చేసిన ట్వీట్‌లో డిజిపి DGP జి.పి. సింగ్ G.P.Singh “చట్టంలోని తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ విషయాన్ని విచారించి, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని దర్రాంగ్ పోలీసు ఎస్పీకి సూచించబడింది” అని చెప్పారు.

మంగళ్‌దైలోని మహర్షి విద్యా మందిర్‌ పాఠశాలలో నాలుగు రోజులపాటు నిర్వహించిన శిబిరంలో యువకులు తుపాకులు, ఇతర ఆయుధాలను హ్యాండిల్‌ చేసేందుకు శిక్షణ పొందుతున్నట్లు వీడియోలో కనిపించింది.

వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజనులు ప్రభుత్వ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పాఠశాల ఆవరణలో నాలుగురోజుల పాటు బహిరంగంగా సాయుధ శిక్షణ జరుగుతూ ఉంటే పోలీసులకు, ప్రభుత్వానికి తెలియదనుకోవడం అమాయకత్వం కాదా ?