దేశవ్యాప్తంగా పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరపాలన్న బీజేపీ ఆశలు నెరవేరేట్టు లేవు. ప్రధాని మోడీ పేరును ఉపయోగించుకొని దేశవ్య
దేశవ్యాప్తంగా పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరపాలన్న బీజేపీ ఆశలు నెరవేరేట్టు లేవు. ప్రధాని మోడీ పేరును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవొచ్చని కలలుగన్న బీజేపీ వెనకడుగు వేసింది.
జమిలి ఎన్నికల వల్ల అనేక లాభాలున్నప్పటికీ జరిగే అవకాశాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికలకు కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకేసారి అన్నిచోట్లా భద్రతా బలగాల మోహరింపు కూడా అసాధ్యం అని ఆయన తెలిపారు.
కాగా, ఈ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇచ్చిన సమాధానంతో దేశంలో జమిలి ఎన్నికలపై జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడినట్టే.