HomeTelangana

కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందంతా హంబక్కేనా.. ఎన్జీటీ ఆదేశాలతో సరికొత్త అనుమానాలు!

కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందంతా హంబక్కేనా.. ఎన్జీటీ ఆదేశాలతో సరికొత్త అనుమానాలు!

రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు సమయంలో ప్రతిపాదించిన మేరకు పర్యావరణ పరిరక్షణ చర్యలకు గాను రూ.3,241 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉన్నది.

బీఆర్ఎస్‌ను భయపెడుతున్న అనర్హత పిటిషన్లు.. ఈ నెలాఖరుకు తేలనున్న భవితవ్యం!
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌

తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినదంతా అబద్దమేనా? మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పదే పదే ప్రస్తావించిన విషయాలన్నీ సత్య దూరాలేనా అంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే నిజమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా పర్యావరణానికి కలిగిన నష్టాన్ని నివారించడానికి, పచ్చదనాన్ని పునరుద్దరించి తిరిగి పెంపొందించడానికి రూ.447 కోట్లను వెచ్చించాలని ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లలోగా ఈ వ్యయాన్ని ఖర్చు చేసి.. పర్యావరణాన్ని తిరగి గాడిన పెట్టాలని ఆదేశించింది.

కాగా, ఇటీవల దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన సమయంలో ఒక రోజును హరితోత్సవంగా నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 శాతం పచ్చదనం పెరిగిందంటూ సీఎం కేసీఆర్ సహా.. మంత్రులు కూడా పదే పదే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పర్యావరణానికి, పచ్చదనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రచారం చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా బంజర భూములు సాగు భూములుగా మారాయని.. భూగర్భ జలాలు పెరిగి.. పచ్చదనం కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు స్వయంగా ఎన్జీటీనే కాళేశ్వరం వల్ల పర్యావరణానికి భారీగా నష్టం కలిగిందని.. దాని పునరుద్దరణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తేల్చింది.

రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు సమయంలో ప్రతిపాదించిన మేరకు పర్యావరణ పరిరక్షణ చర్యలకు గాను రూ.3,241 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉన్నది. కాళేశ్వరం కారణంగా దాదాపు రూ.622 కోట్ల విలువైన పర్యావరణం, జీవావరణానికి నష్టం కలిగిందని ఎన్జీటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ సమతుల్యతను ప్రాధాన్యత అంశంగా తీసుకొని వెంటనే పునరుద్దరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.