HomeTelangana

హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !

హిమాన్షు అన్నా ప్లీజ్ మా స్కూల్ నూ దత్తత తీసుకోవా !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా, సీఎం కేసీఆర్ తో భేటీ
‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’
తుమ్మలతో రేవంత్ భేటీ… త్వరలో కాంగ్రెస్ లోకి తుమ్మల?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అక్కడ మౌలిక వసతుల కోసం సొంతగా రూ.40 లక్షలు ఖర్చు చేసి9న విషయం తెలిసిందే. ఇవి తాతనో, తండ్రినో అడిగి కాకుండా.. స్నేహితులతో కలిసి ఈవెంట్స్ చేసి సంపాదించినట్లు స్వయంగా హిమాన్షు చెప్పారు. అంతే కాకుండా సీఎస్ఆర్ కింద మరి కొంత అమౌంట్‌ను సమకూర్చుకొని.. గౌలిదొడ్డి పాఠశాలలో వసతులు మెరుగుపరిచారు.

ఈ నేపథ్యంలో తమ స్కూల్ నూ కూడా దత్తత తీసుకొని బాగుపర్చాలని హిమాన్షును కోరేవారు పెరిగిపోయారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండ తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు పాతబడిపోయి. ఎలాంటి వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూళ్ళలో నారాయణగూడలోని ప్రభుత్వ పాఠ‌శాల కూడా ఉంది. ఇప్పుడు ఆ స్కూల్ విద్యార్థులు తమ స్కూల్ ను బాగుచేయాలని హిమాన్షును వేడుకుంటున్నారు.

తమ స్కూల్ లో బాత్ రూం డోర్లు విరిగిపోయాయని దాంతో ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, స్కూల్ కు ప్లే గ్రౌండ్ లేదని, కంప్యూటర్లు లేవని, లైబ్రరీ, స్పోర్ట్స్ కిట్ తదతరాలు ఏమీ లేవని, విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి పుస్తకాలు, యూనిఫామ్స్ లేవని చెప్తున్న విద్యార్థులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తమ స్కూల్ ను అసలు పట్టించుకోవడం లేదని అందువల్ల మీరైనా దయతలచి తమ స్కూల్ ను దత్తత తీసుకొని బాగుచేయాలని ఆ స్కూల్ విద్యార్థులు హిమాన్షును కోరారు.

ఈ మేరకు AISF బాలల సంఘం అద్వర్యంలో నారాయణ గూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ‘హిమాన్షు అన్నా మా స్కూల్ ను కూడా బాగుచేయండి’ అని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు.