HomeTelanganaPolitics

‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’

‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’

రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు రోజూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వారు తనను బెదిరిస్తున్నారని టీఆరేస్ నేత్ అదాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వ

మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల అనౌన్స్ మెంట్… బీఆరెస్ లో టిక్కట్ల టెన్షన్… వారి కోసం కవిత పైరవీ
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు -బండి సంజయ్ సంచలన ఆరోపణ‌

రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు రోజూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వారు తనను బెదిరిస్తున్నారని టీఆరేస్ నేత్ అదాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో దోషిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని శ్రవణ్ సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్, సంబంధిత పోలీసు అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన పోలీసు అధికారులకు ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

కొద్ది సేపటి క్రితం శ్రవణ్ చేసిన ట్వీట్:

గత రాత్రి,
కాంగ్రెస్ INCTelangana అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Revanth anumula అనుచరులమని చెప్పుకుంటు కొంతమంది వ్యక్తులు నా మొబైల్‌కి 12.15 AM నుండి పదే పదే కాల్స్ చేసారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అసభ్య పదజాలంతో బెదిరించారు.

నేను సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను.

ఈ బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తాను.
తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉండడం దురదృష్టకరం.
గతంలో కూడా తన అనుచరుల ద్వారా వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి తదితర సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ఆయన ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు.

ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా నన్ను అడ్డుకోలేవని రేవంత్ తెలుసుకోవాలి.కాంగ్రెస్ INCIndia లాంటి 125 ఏళ్ళ పార్టీలో ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్‌ని ఎలా ప్రోత్సహిస్తున్నారు & సహిస్తున్నారు?