HomeNational

టమాటా కథలు: కూరలో రెండు టమాటాలు వేసిన భర్త… కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన భార్య‌

టమాటా కథలు: కూరలో రెండు టమాటాలు వేసిన భర్త… కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన భార్య‌

దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్న విషయం తెలిసిందే. కిలో టమాటాలు 150 రూపాయల నుండి 250 రూపాయల దాకా పలుకుతోంది. దొంగలు కూడా బంగారం దొంగతనాలు మానేసి టమా

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌
5 రాష్ట్రాల్లో సీ ఓటర్ సర్వే… కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో, బీజేపీ 1, ఇతరులు ఒక రాష్ట్రంలో గెలుపు
ప్రియాంకా గాంధీపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ …ఆమెపై కేసు నమోదు… ఎందుకంటే …?

దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నంటుతున్న విషయం తెలిసిందే. కిలో టమాటాలు 150 రూపాయల నుండి 250 రూపాయల దాకా పలుకుతోంది. దొంగలు కూడా బంగారం దొంగతనాలు మానేసి టమాటాల దొంగతనాలకు దిగేపరిస్థితి నెలకొంది. టమాటాలను కాపాడుకోవడానికి కొందరు వ్యాపారులు బౌన్సర్లను కూడా పెట్టుకున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో జరిగిన‌ ఓ సంఘటన కలకలం సృష్టిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో టమాటా ధరల పెరుగుదల భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. టమాట ధరలు అధికంగా ఉండడంతో గృహిణులు వంట చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన భార్యను అడగకుండానే రెండు టమాటాలను వంటలో ఉపయోగించాడు. దీంతో భార్య మనస్తాపానికి గురైంది. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ గొడవ తీవ్రమైపోయి భార్య‌ ఇంటి నుంచి వెళ్లిపోయింది.

సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి షాహ్‌దోల్ లో ఓ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఇటీవల అతను తన భార్యను అడగకుండా వంట చేసేటప్పుడు రెండు టమోటాలు వాడాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. తనని అడగకుండానే టమాటాలు ఎలా వేస్తావని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. టమాటా ధరలు ఇంతగా పెరిగిపోయినప్పుడు వాటిని ఎలా వాడుతావని ఆమె భర్తను ప్రశ్నించింది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.

వాగ్వాదం తర్వాత, ఆమె సంజీవ్ ఇంట్లో లేని సమయాన్ని చూసి తన కుమార్తెతో తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. దీంతో కంగుతిన్న బర్మన్ వారి కోసం అనేక చోట్ల వెతికాడు. ఎంత వెతికినా భార్యా కూతురి ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్య, కుమార్తె అదృశ్యంపై సంజీవ్ ఫిర్యాదు చేశాడు. తను వండే కూరలో రెండు టొమాటోలు వాడినందుకే వాగ్వాదం మొదలైందని సంజీవ్ తన పిర్యాదులో పేర్కొన్నాడు. మూడు రోజులుగా తన భార్య కనిపించడంలేదని, ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పాడు. సంజీవ్ భార్యను వెతికి తీసుకొస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.