HomeTelanganaPolitics

బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌

బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌

బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. బం

‘బండి సంజయ్ ని చూసి బాత్ రూం లోకి వెళ్ళి బోరున ఏడ్చాను’
మోడీ ఉపన్యాసంపై మండిపడ్డ బీజేపీ సీనియర్ నేత
12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది. బండిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఇద్దరు నేతల మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్న బిజెపి సోషల్ మీడియా విభాగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరి నాయకులపై మరొకరు వ్యంగ్య వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గం జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలు, సభ్యులు తమ నాయకుడికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టినందుకు బండి వర్గం మీడియా సెల్‌ సభ్యులపై దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. బండి మద్దతుదారుడిని ఈటల వర్గీయులు కాలర్ పట్టుకుని లాగారని ‘తెలంగాణ టుడే’ వెబ్ సైట్ పేర్కొంది.

ఈటల వర్గం సోషల్ మీడియా గదికి తాళం వేసి తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేసినట్టు ఆ వెబ్ సైట్ తెలిపింది. అయితే పార్టీ సీనియర్ నేతల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. రాష్ట్ర నాయకత్వం చిన్నపాటి గొడవేనని, అంతర్గత కుమ్ములాటలతో సంబంధం లేదని తేల్చిచెప్పే ప్రయత్నం చేసింది.

బండి సంజయ్ మద్దతుదారులు తమ నాయకుడిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినందుకు ఈటలను నిందిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీలో ఈటల ఎదుగుదల కూడా బీజేపీలోని ఒక వర్గం నేతలకు నచ్చడంలేదని, ఆయనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల వర్గం నేతలు మండిపడ్డారు.