HomeTelanganaPolitics

సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు: మంత్రి సురేఖ

సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు: మంత్రి సురేఖ

సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు: మంత్రి సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసెంబ్లీ లాబీల్లో విలే

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల
అది ఫ్రస్ట్రేషనా ? బెధిరింపులా ? తమ‌ వాళ్ళను నిలబెట్టుకునే ప్రయత్నాలా?
BJP అబద్దాలు నార్త్ లో నమ్ముతారేమో కాని తెలంగాణలో నమ్మరన్న జిట్టా బాలకృష్ణారెడ్డి… పార్టీ నుంచి సస్పెండ్ చేసిన‌ బీజేపీ

సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు: మంత్రి సురేఖ

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదని, అది జగమెరిగిన రహస్యం అని ఆమె అన్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలనే చట్ట సవరణ చేశామన్నారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది… కానీ యాదగిరిగుట్ట బోర్డు కు ప్రభుత్వం కంట్రోల్ లోనే ఉంటుందన్నారు. హైదరాబాద్ కు ఏపీ సీఎం వస్తే…చంద్రబాబు ను కలసి టీటీడీ సిఫారసు లేఖలను అనుమతించాలని అడుగుతానన్నారు. కనీసం మా లెటర్ కూడా టీటీడీ లో పనిచేయకపోతే ఎలా, అని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇష్టారీతిలో ఎవరికి లెటర్ ఇవ్వడం లేదని,అయినా ఇప్పుడు ఎందుకు ఆపారో తెలియడం లేదన్నారు. దైవ దర్శనాల దగ్గర అభ్యంతరాలు పెట్టడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి. మేము ఏమి అభ్యంతరం తెలుపమన్నారు. వివాదాలు సృష్టంచే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారని మంత్రి తెలిపారు.ఆర్కీయాలజీ ,దేవాదాయ ,టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయని, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజ్ కు ఇస్తామని, దేవాలయాల గోల్డ్ కు సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నామని, ఒక్క వేములవాడ లోనే 60 కేజీ ల గోల్డ్ ఉందని, మంత్రి తెలిపారు. అన్నీ దేవలయాలను ఓకే గొడుకు కిందకు తీసుకువస్తామని, ప్రతీ గుడి ఖర్చు లు థర్డ్ పార్టీ తో ఆడిట్ చేపిస్తామని మంత్రి తెలిపారు.