HomeTelanganaPolitics

ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్

ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్

విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు.*మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో గెలుపోటములు సహజం విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు.*మంత్

ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో…బిఆర్ఎస్ లో లుకలుకలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్‌…మంత్రి శ్రీధర్ బాబు

విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు.
*మంత్రి పొన్నం ప్రభాకర్

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు.
*మంత్రి పొన్నం ప్రభాకర్

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రంజాన్ గిఫ్ట్ ఇచ్చానంటూ మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనలేమి కి నిదర్శనంగా ఉన్నాయని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్రం నుంచి వచ్చే నిధులు పనులు తీసుకురావాలన్నారు.
రామగుండం నుంచి హైదరాబాద్ వరకు ఎయిట్ లైన్ రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు.
ఇదంతా బీఆర్ఎస్ బిజెపి మైత్రిని తెలిపే ముచ్చటని, రెండూ కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని ప్రయత్నించాయన్నారు. కేసీఆర్,హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థులను పెట్టకుండా బిజెపితో కుమ్మక్కయ్యారని ప్రభాకర్ ఆరోపించారు.
ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గతంలో టూరిజం ఆర్కియాలజీ మినిస్టర్ గా ఉండి హైదరాబాద్ కు చేసింది ఏంటి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల బీజేపీ ఇప్పటికే వివక్ష చూపుతూనే ఉందని, తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో బిజెపి ఎంపీలు ఎందుకు కృషి చేయడం లేదని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. కేటీఆర్, కేసీఆర్,హరీష్ ఎటు ఓటు వేశారో చెప్పాలని,
బీజేపీ చెల్లని ఓట్ల అంత మెజార్టీ కూడా రాలేదన్నారు.
ఎందుకు అంత మిడిసిపాటు పడుతున్నారు వారికే తెలియాలని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓటమి పాలయ్యామన్నారు.
ఓటమిపై సమీక్షించుకుంటామని, ఈ ఓటమి భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపించదన్నారు.