ములుగు జిల్లాలో పేలిన తూట..! చల్పాకలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోలు మృతి..! జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/ ములుగు ప్రతినిధి (నినాదం) ములుగు
ములుగు జిల్లాలో పేలిన తూట..!
చల్పాకలో భారీ ఎన్ కౌంటర్
ఏడుగురు మావోలు మృతి..!
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో/ ములుగు ప్రతినిధి (నినాదం)
ములుగు జిల్లాలో తూట పేలింది. ఏటూరునాగారం మండలంలోని చల్పాకలో గ్రేహౌండ్స్ బలగాలకు, మావోలకు మధ్య కాల్పులు జరగగా ఏడుగురు మావోలు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్ కౌంటర్ లో ముగ్గురు హతమైనట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తివివరాలు తెలియాలంటే పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
గతంలో ఘోర ఘటన
కొన్నేళ్ల క్రితం ఏటూరునాగారంలోని చల్పాకలో ఒళ్లు గగ్గురు పొడ్చే ఘటన చోటు చేసుకుంది. పీపుల్స్ వారు.. మందుపాతరకు పోలీసులు జీపు ఎగిరిపడి… పోలీసుల అవయవాలు.. చెట్లపై పడిన ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. ఈ ఘటనలో సీఐ, ఎస్సై మరణించగా.. కానిస్టేబుల్లు గాయాలతో భయపడ్డారు. మళ్లీ ఇదే ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరగడంతో.. ఆ ఘటన నేడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.