HomeTelanganaPolitics

భారీ విస్తరణపై ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల వ్యయం: మంత్రి శ్రీధర్ బాబు

భారీ విస్తరణపై ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల వ్యయం: మంత్రి శ్రీధర్ బాబు

భారీ విస్తరణపై ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల వ్యయం: మంత్రి శ్రీధర్ బాబు ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీ (వృత్తాకార ఆర్థి

‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’
కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్
Telangana: రాబోయే ఎన్నికల్లో రజాకార్ల సర్కార్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది -అమిత్ షా

భారీ విస్తరణపై ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల వ్యయం: మంత్రి శ్రీధర్ బాబు

ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీ (వృత్తాకార ఆర్థిక వ్యవస్థ)కి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు సంస్థ ప్రతినిధులు సచివాలయంలో తనను కలిసిన అనంతరం ఆయన వివరాలు తెలిపారు. ప్రస్తుతం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో ‘బన్యన్ నేషన్’ రీ సైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తోంది. దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని ఆయన చెప్పారు. విస్తరణ పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను ఈ సంస్థ యూనిలివర్, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ‘బన్యన్ నేషన్’ లాభాల్లో నడుస్తోందని చెప్పారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం వారు మరికొంత భూమిని అడుగుతున్నారని, దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సిఇఓ వి. మధుసూదన్, బన్యన్ నేషన్ సిఇఓ మణి వాజిపేయ్, సిఓఓ రాజ్ కిరణ్ మదనగోపాల్ లు పాల్గొన్నారు.