*ఇంకా కార్యాలయంలో పార్టీ జెండాలు *పట్టించుకోని మున్సిపల్ అధికారులు కోదాడ,నినాదం:కోదాడ మున్సిపల్ కార్యాలయం BRS కార్యాలయం అన్నట్టు మున్సిపల్ అధిక
*ఇంకా కార్యాలయంలో పార్టీ జెండాలు
*పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కోదాడ,నినాదం:
కోదాడ మున్సిపల్ కార్యాలయం BRS కార్యాలయం అన్నట్టు మున్సిపల్ అధికారుల తీరు కనిపిస్తుంది. కార్యాలయంలో BRS పార్టీకి చెందిన జెండాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండా అలాగే ఉంచడంపై ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వివిధ పనులను నిమిత్తం అనేకమంది పట్టణ ప్రజలు వస్తూపోతూ ఉంటారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా కార్యాలయం ఉండాలి కానీ BRS పార్టీకి సంబంధించిన జెండాలను ఇంకా గదిలో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముగిసి చాలా నెలలు కావస్తున్న ఆ జెండాలను తొలగించకుండా ఉంచడం ఏంటని కార్యాలయానికి వచ్చే పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గదిలో ఉన్న పార్టీ జెండాలను తొలగిస్తారో లేదో వేచి చూడాలి.