HomeTelanganaPolitics

పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మరో పంచ్

పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ మరో పంచ్

వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల‌ పట్ల కొందరు ఆనందంగా ఉండగా మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా
నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి… ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తా
జనసేనలోకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు?

వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల‌ పట్ల కొందరు ఆనందంగా ఉండగా మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో కొంత కాలంగా టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్, డిప్యూటీ సీఎం పవన్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పవన్ తిరుపతి సభలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలోప్రకాష్ రాజ్ మళ్ళీ పంచ్ వేశాడు.ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడితే నటులు, చిత్ర పరిశ్రమ, వ్యాపారస్తులు అందరూ మాట్లాడుతారని, సనాతన ధర్మం పై దాడులు జరిగితే ఒక్కరూ స్పందించరని నిన్న పవన్ ఆరోపించారు. కోర్టులు కూడా హిందూ మతం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపణ చేశారు. ఏదేమైనా తాను మాత్రం స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణకోసమే పని చేస్తానని చెప్పాడు. దీనిపై స్పంధించి ప్రకాష్ రాజ్ ‘స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి, స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం’ అని సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.