ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్. పదేళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏమిటి. టిఆర్ఎస్ నాయకుల
ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్.
పదేళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏమిటి.
టిఆర్ఎస్ నాయకుల రాకతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కార్యకర్తలకు ఇస్తున్న బహుమానం ఇదేనా.
కాంగ్రెస్ నేతల్లో మొదలైన ఆందోళన.
జమ్మికుంట, మార్చి 30 (నినాదం న్యూస్)
జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి శనివారం హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందా? అనేది స్థానిక కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడి జెండాను గుండెపై పెట్టుకొని మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పార్టీ అధిష్టానం ఏం న్యాయం చేసిందో అర్థం కావడం లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడానికి ఎన్నో కొర్రీలు పెట్టిన అప్పటి టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ మేము పార్టీలోకి వస్తామనడం వారు రమ్మని ఆహ్వానించడం స్థానిక కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి స్వార్థం కొరకు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అధిష్టానం ఆలోచించుకోవాలని వారు అంటున్నారు. 10 సంవత్సరాలుగా ఎన్నో కేసులకు లోనై ఎవరు పట్టించుకోని సమయంలో కూడా పార్టీ అభివృద్ధి కొరకు జెండాను గుండె మీద పెట్టుకొని నియోజకవర్గంలో కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏమిటో అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుండి నాయకులు రాకతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి దయనీయంగా మారబోతుందని స్థానిక నేతలు అంటున్నారు. ఈ వరుసలు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీలో ముసలం తప్పదని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అంటున్నారు.