HomeTelanganaUncategorized

మంత్రి పొంగులేటి అకస్మిక పర్యటన

మంత్రి పొంగులేటి అకస్మిక పర్యటన

59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో ఆకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

వచ్చే అసె‍ంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థులు: KCR ఫైనల్ చేసిన లిస్ట్ ఇదేనా?
అసెంబ్లీలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు…స్వంత పార్టీపైనే విమర్శలు
మార్చ్ 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం.కెటిఆర్

59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో ఆకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ద్విచక్రవాహనం పై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులు పరిశీలించారు

విధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు

వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ ఆకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు.

అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు.

ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు