HomePoliticsAndhra Pradesh

చంద్రబాబుకు షాకిచ్చిన పీకే…ఆనందంలో వైసీపీ శ్రేణులు

చంద్రబాబుకు షాకిచ్చిన పీకే…ఆనందంలో వైసీపీ శ్రేణులు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన కూటమి చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల్ నోటి ఫికేషన్ రాలేదు కానీ ప్రచారాలు ఎప్ప

గద్దర్ గురించి చంద్రబాబు అంత కలత చెందాడన్న మాటలు నమ్మొచ్చా ?
రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ తిరస్కరణ‌
రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపి కలిసి పోటీ చేస్తాయి… ప్రకటించిన‌ పవన్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన కూటమి చేయని ప్రయత్నం లేదు. ఎన్నికల్ నోటి ఫికేషన్ రాలేదు కానీ ప్రచారాలు ఎప్పుడో మొదలయిపోయాయి. వైసీపీ అయితే అప్పుడే అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన చంద్రబాబు బీజేపీని కూడా పొత్తులోకి తీసుకరావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

గెలుపుకు ఇవి మాత్రమే సరిపోవని, గెలవాలంటే ప్రొఫెషనల్ వ్యూహకర్తలు, సంస్థలు తమ కోసం పని చేయాలని ఇప్పుడన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు, దేశంలోనే పేరెన్నికగన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశా‍ంత్ కిశోర్ ను కూడా తనకు మద్దతుగా తెచ్చుకుందామనే ప్రయత్నాలు చేశారు.

ఇందులో భాగంగానే నారా లోకేశ్ హైదరాబాద్ లో ప్రశాంత్ కిశోర్ ను కలిసి ఆయనను విజయవాడకు తన తండ్రి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ ముగ్గురి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రశాంత్ కిశోర్ టీడీపి కోసం పని చేయబోతున్నాడనే ప్రచారం సాగింది. ప్రశాంత్ కిశోర్ తమకు మద్దతుగా నిలబడితే ఇక తమ గెలుపు ఖాయమనే రీతిలో టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాలు ఊహించని షాక్ లాగా అసలు నిజం బైటికి వచ్చింది. ప్రశాంత్ కిశోర్ ఓ ఇంటర్వ్యూలో తాను టీడీపీ కోసం పని చేయడం లేదని కుండబ‌ద్దలు కొట్టాడు. తాను ఈ సారి ఏ పార్టీ కోసం కూడా పని చేయడం లేదని ఆయన స్పష్టం చేశాడు. చంద్రబాబు తనను కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నట్టు తమ ఇద్దరికి సన్నిహుడైన ఓ రాజకీయ నాయకుడు తనతో చెప్పాడని, అయితే తాను టీడీపీ కోసం పనిచేయబోనని అప్పుడే చెప్పానన్నాడు పీకే. అయితే ఆ విషయం బాబుతోనే చెప్పాలని ఆ రాజకీయనేత కోరగా తాను విజయవాడ వెళ్ళీ బాబును కలిసి ఆ విషయాన్నే స్పష్టంగా చెప్పానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ మాట్లాడిన ఈ వీడియో ను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. ప్రశాంత్ కిశోర్ మద్దతు ఇస్తే తాము గెలుస్తామని టీడీపీ భావించి ప్రచారం చేసినట్టే, ప్రశాంత్ కిశోర్ మద్దతు టీడీపీకి లేదు కాబట్టి ఇక ఓడిపోవడం గ్యారంటీ అన్నట్టుగా వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది.