HomePoliticsNational

మోడీ మళ్ళీ ఏడ్చాడు

మోడీ మళ్ళీ ఏడ్చాడు

ప్రధాని మోడీ గొప్ప ఉపన్యాసకుడు. తన ఉపన్యాస ప్రతిభతో ప్రజలను ప్రభావితం చేయడంలో, వారిని తనవైపు ఆకర్శించడంలో దిట్ట. అప్పుడప్పుడు కన్నీరు పెట్టుకొని కండు

కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి
హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
రైల్లో కానిస్టేబుల్ కాల్పులు – ASI సహా నలుగురు మృతి

ప్రధాని మోడీ గొప్ప ఉపన్యాసకుడు. తన ఉపన్యాస ప్రతిభతో ప్రజలను ప్రభావితం చేయడంలో, వారిని తనవైపు ఆకర్శించడంలో దిట్ట. అప్పుడప్పుడు కన్నీరు పెట్టుకొని కండువాతో తుడుచుకొని, కన్నీళ్ళు మింగుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడి ప్రజలను భావోద్వేగానికి గురి చేయడంలో దేశంలో ఇప్పటి వరకు ఆయనను మించినవాళ్ళు లేరనే చెప్పవచ్చు. ఈ రోజు మోడీ మరో సారి జనం ముందు తన పేదరికాన్ని చెప్పుకొని కన్నీరు పెట్టాడు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు శుక్రవారం అందజేసిన అనంతరం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.

“నేను ఆ ఇళ్ళను సందర్శించాను . వాటిని చూసినప్పుడు నా చిన్నతనంలో ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం నాకు కూడా వచ్చి ఉంటే బావుండు అనుకున్నాను” అని మోడీ అన్నారు. అనంతరం ఆయన మంచినీళ్ళు తాగి కొద్ది సేపు ఆగి ధుంఖంతో నిండిన గొంతుతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోందని అన్నారు.

“ఈ వేల కుటుంబాల కలలు నెరవేరినప్పుడు, వారి ఆశీర్వాదమే నా అతిపెద్ద నిధి అవుతుంది” అని ప్రధాని అన్నారు.
షోలాపూర్‌లోని వేలాది మంది పేదలు, కూలీల కోసం మేము చేసిన ప్రతిజ్ఞ ఈరోజు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన రోజే మీ ఇళ్ల తాళాలు ఇవ్వడానికి నేను త్వరలో మళ్ళీ వస్తానని హామీ ఇచ్చాను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

“ఈరోజు మోడీ ఈ హామీని నెరవేర్చారు. మోడీ గ్యారెంటీ అంటే ‘గ్యారెంటీ కే పూరా హోనే కి గ్యారెంటీ’ అని గుర్తుంచుకోండి!” అని ఆయన అన్నాడు.

తన ప్రసంగంలో, PM మోడీ జనవరి 22 న ప్రజలు తమ ఇళ్లను రామజ్యోతితో ప్రకాశవంతం చేయాలని కోరారు. “జనవరి 22 న ప్రజలు వెలిగించే రామజ్యోతి వారి జీవితాల నుండి పేదరికాన్ని తొలగించడానికి ప్రేరణగా ఉంటుంది,” అన్నారాయన.