గుజరాత్‌లోని వడోదర నగరం శివార్లలో గురువారం ఒక సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 18 మంది మరణించారు ఇందులో 16 మంది విద్యార్థులు కాగా ఇద్దరు ఉపాధ్యాయులు. ప
గుజరాత్‌లోని వడోదర నగరం శివార్లలో గురువారం ఒక సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో 18 మంది మరణించారు ఇందులో 16 మంది విద్యార్థులు కాగా ఇద్దరు ఉపాధ్యాయులు. పాఠశాల విహారయాత్ర విషాదకరంగా మారిందని పోలీసు అధికారులు తెలిపారు. రెండు డజన్ల మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లి హర్ని సరస్సులో బోటు షికారు చేస్తుండగా మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగినట్లు వారు తెలిపారు. విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు. వారితో పాటే ఉపాధ్యాయులు కూడా ఎక్కారు. పడవ సరస్సులో కొంతదూరం వెళ్లగానే తిరగబడింది. ఆ సమయంలో పడవలో 27 మంది ఉన్నారు. వారిలో 18 మంది ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
“ఇప్పటి వరకు, ఈ విషాదంలో 16 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించారు. రక్షించబడిన ఒక విద్యార్థి SSG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు” అని హర్ని పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
ప్రమాదం తరువాత, వడోదరలోని హర్ని సరస్సు వద్ద పడవ బోల్తా పడిన కారణంగా ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ప్రధాన మంత్రి కార్యాలయం 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ‘ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది.
పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు మరణించిన ప్రతి కుటుంబానికి అందజేయబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తారు.