గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్స్GFP ప్రకారం శక్తివంతమైన మిలటరీ జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో నిల్చింది. మొదటి స్థానంలో అమెరికా, రెండ్వ స్థానంలో రష
గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్స్GFP ప్రకారం శక్తివంతమైన మిలటరీ జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో నిల్చింది. మొదటి స్థానంలో అమెరికా, రెండ్వ స్థానంలో రష్యా , మూడవ స్థానంలో చైనా ఉన్నాయి.
GFP అంచనా ప్రకారం, భారతదేశం పవర్ ఇండెక్స్ (PwrIndx) స్కోరు 0.1023ని కలిగి ఉంది. (0.0000 స్కోరు ‘పరిపూర్ణమైనది’గా పరిగణించబడుతుంది). US పవర్ ఇండెక్స్ స్కోర్ 0.0699, రష్యా 0.0702 మరియు చైనా 0. 0706.
గ్లోబల్ ఫైర్‌పవర్ 2024 మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్‌ల కోసం మొత్తం 145 దేశాల యొక్క ప్రపంచ సైనిక పరాక్రమం ఆధారంగా అంచనా వేయబడ్డాయి.
భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇటలీ 10వ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ , టర్కీ కూడా టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
సైనిక బలం, సామగ్రి, బడ్జెట్, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం వంటి ప్రధానమైన అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌లను నిర్ణయించారు.