HomeTelanganaPolitics

అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్

అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్

కొంత కాలంగా ఎదురు చూస్తున్న పదవిని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అందుకోబోతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క

కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే
బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ ల యుద్దం

కొంత కాలంగా ఎదురు చూస్తున్న పదవిని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అందుకోబోతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరినిరు అభ్యర్థులుగా ఖరారు చేసింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ ఆయన టిక్కెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు జనవరి 18, గురువారంతో ముగియనుంది. ఎల్లుండి లోగా వారు నామినేషన్ దాఖలు చేయనున్నారు.