ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు క
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసులో గత ఏడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు పంపించడంతో కవితకు మళ్లీ విచారణ ముప్పు పొంచి ఉంది.
ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు పంపించింది. మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపించారు. అయితే తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని కోరుతూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతోంది.
కాగా, లిక్కర్ కేసులో రేపటి ఈడీ విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు ఉన్నంతదున తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు.