HomeTelanganaPolitics

మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మల్కాజీగిరి ఎంపీగా పోటి చేయడానికి పట్టుబడుతున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తరువాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్

రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
‘బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా’
BSP నుంచి BRS పార్టీలో చేరికలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తరువాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ 31 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి గెలిచారు.

మల్లారెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచారు. 2018లో, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి బీఆరెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.

మల్లారెడ్డి ఎంపీగా గెలిచినట్లయితే, మేడ్చల్ నుంచి తన కోడలు ప్రీతి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు.

మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేయాలని పట్టుబడుతున్నప్పటికీ, బీఆరెస్ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేడ్చల్ అసెంబ్లీ, మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాలు రెండూ కీలకం కావడంతో, ఈ విషయంలో సీరియస్‌గా ఆలోచన చేస్తోంది.