HomeTelanganaPolitics

త్వరలో బీఆరెస్ లో చీలిక తప్పదు – పొన్నం ప్రభాకర్

త్వరలో బీఆరెస్ లో చీలిక తప్పదు – పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ నుంచి బీఆరెస్ లోకి ఎవరూ వెళ్ళరని, తవ్రలో బీఆరెస్సే చీలిపోతుందని9 తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల – కేసీఆర్ పై ఈటెల పోటీ
ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడికెళ్ళి ఓడిస్తా -కల్వకుంట్ల కవిత‌
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు

కాంగ్రెస్ నుంచి బీఆరెస్ లోకి ఎవరూ వెళ్ళరని, తవ్రలో బీఆరెస్సే చీలిపోతుందని9 తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తాడన్న బీజేపీ నాయకుడు బండిసంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు.

బీజేపీ, బీఆరెస్ రెండు కలిసే పనిచేస్తున్నాయన్న నిజం దీన్ని బట్టి అర్దమవుతోందని, అందుకే బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఒక పార్టీకి సంబంధించిన సమాచారం మరో పార్టీకి తెలుసునని పొన్నం అన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ, బీఆర్ఎస్‌లతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలన్నింటినీ ఆ వ్యాఖ్యలు స్పృహలోకి తెచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చే సాహసం ఎవరూ చేయలేరని,
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాలు విసిరారు.

కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఏమీ లేదని స్పష్టం చేశారు.బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్యం చదివారా మా పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మీకెందుకు? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వినోద్, సంజయ్‌లు ప్ర్4అజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కేంద్రంలోనూ కాంగ్రెస్ రావాలి అని పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.