HomePoliticsNational

భారత్ న్యాయ యాత్ర ప్రారంభం…అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర అవసరమన్న‌ రాహుల్ గాంధీ

భారత్ న్యాయ యాత్ర ప్రారంభం…అన్యాయ కాలంలో ఉన్నాం కాబట్టే న్యాయయాత్ర అవసరమన్న‌ రాహుల్ గాంధీ

కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ ఎంపీ ర

హమ్మయ్య! ఎట్టకేలకు మోడీ గొంతు విప్పారు
‘మళ్ళీ బాంబులు పేలొచ్చు, రామాలయంపై దాడి జరగొచ్చు, ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు’
హ‌త్యాచారాలు, నగ్న ఊరేగింపులు…ఒకటి కాదు వందలు జరిగాయని స్వయంగా అంగీకరించిన మణిపూర్ సీఎం

కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ ​​పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిఅన్ బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ఢిల్లీలో పొగమంచు కారణంగా మా విమానం ఆలస్యమైంది. మీరు ఉదయం నుండి ఇక్కడ వేచి ఉన్నారు. కాబట్టి నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు.
బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, “నేను జూన్ 29న మణిపూర్‌కు వచ్చాను, ఆ పర్యటనలో నేను చూసినవి, విన్నవి ఇంతకు ముందెన్నడూ చూడలేదు. మణిపూర్‌లో చాలా మంది చనిపోయారు. ప్రజలు బాధపడ్డారు. కానీ ప్రధాని మోడీ మీకు భరోసాకల్పించడానికి రాలేదు. మీ కన్నీళ్లు తుడవడానికి రాలేదు. బహుశా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు మణిపూర్ భారతదేశంలో భాగం కాదు కాబోలు.” అన్నారు
న్యాయ యాత్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”ఇప్పుడు ఎన్నికల సమయం. పాద యాత్ర అయితే సమయం ఎక్కువ పడుతుంది. అందుకే బస్సుయాత్ర, నడక యాత్ర అని నిర్ణయించుకున్నాం. మణిపూర్ ప్రజల బాధను అర్థం చేసుకున్నాం. హామీ ఇస్తున్నాం. ఇక్కడ మేము మళ్ళీ శాంతిని పునరుద్దరిస్తాం.
మణిపూర్‌లో ప్రాథమిక పాలనా విధానం విఫలమైందని, ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి రాకపోవడం సిగ్గుచేటని, బీజేపీ రాజకీయాల వల్ల మణిపూర్‌ విలువైన ప్రాణాలను, ఆస్తులను కోల్పోయిందని రాహుల్‌ గాంధీ అన్నారు.

న్యాయ యాత్ర ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు దేశంలో న్యాయం లేదు కాబట్టి భారత్ న్యాయ యాత్ర అవసరం ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు.