HomeTelanganaPolitics

మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పరిపూర్ణానంద …మల్కాజిగిరి లేదా హిందూ పురం నుంచి ఎంపీగా పోటీ ?

మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పరిపూర్ణానంద …మల్కాజిగిరి లేదా హిందూ పురం నుంచి ఎంపీగా పోటీ ?

2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేసి, తానే ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం కూడా జరిగిన పరిపూర్ణానంద రాజకీయ పునరాగమనం చేయబోతున్నారు. ఈ సార

వైసీపీకి షాక్ ఇచ్చిన ముద్రగడ పద్మనాభం
ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉందన్న హీరోయిన్
అంగన్‌వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు

2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేసి, తానే ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం కూడా జరిగిన పరిపూర్ణానంద రాజకీయ పునరాగమనం చేయబోతున్నారు. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో ఆయనతో పోటీ చేయించాలని భావిస్తున్నటు సమాచారం.

ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే కాకినాడ శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీతో ఆయనకున్న అనుబంధం, గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడం వంటివి పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను సూచిస్తున్నాయి.

హిందుత్వ ఎజెండాతో హిందూమతాన్ని ప్రచారం చేయడంలో పరిపూర్ణానంద‌ ప్రసిద్ధి చెందారు. ఆయన వల్ల కొన్ని ప్రాంతాలలో బిజెపికి మద్దతు పెరిగిందని ఆ పార్టీ భావిస్తున్నది. తెలంగాణలోని మల్కాజిగిరి నియోజక వర్గం, ఆంధ్రప్రదేశ్ లోని హిందూ పురం నియోజకవర్గాల్లో ఏదైనా ఒక దాని నుంచి ఆయనను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది.

హిందూపురంలో హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో ఆయన‌ చురుకుగా ఉన్నారు. అక్కడ ఆయన తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.

ప్రస్తుతం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పరిపూర్ణానంద పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం తర్వాత సీట్ల కేటాయింపులపై బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాగా, 2018 తెలంగాణ ఎన్నికల్లో విఫలమైన పరిపూర్ణానందవల్ల ఇప్పుడు ఉపయోగముంటుందా అనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో వినపడుతున్నది.