అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ను ఓడించి ప్రజలు తప్పుచేశారని బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారని అది సరైంది కాదని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ను ఓడించి ప్రజలు తప్పుచేశారని బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారని అది సరైంది కాదని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి బీఆర్ఎస్ నేతలు అలాంటి మాటలు మాట్లాడవద్దని ఆయన ఆదేశించారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారని బీఆరెస్ నేతలు వివిధ సందర్భాలలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక నుంచి మన నాయకులు ఎవరూ అలా మాట్లాడవద్దని సూచించారు.
తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా అదే ప్రజలు అనే విషయం మర్చిపోవద్దన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.