ఈక్వెడార్ దేశ రాజధాని గ్వయకిల్‌లోని టీసీ టీవీ ఛానల్‌పై మంగళవారం దుండగులు దాడి చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా ఛానల్ లైవ్ స్ట
ఈక్వెడార్ దేశ రాజధాని గ్వయకిల్‌లోని టీసీ టీవీ ఛానల్‌పై మంగళవారం దుండగులు దాడి చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా ఛానల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించిన వారు ఉద్యోగుల తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు. 15 నిమిషాల పాటు టీవీ లైవ్‌లోనే తీవ్ర కలకలం సృష్టించారు.
దుండగులు తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఛానల్‌ను చుట్టుముట్టారు. దుండగులు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద చర్యల కింద వారిపై కేసు నమోదు చేశారు.
ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు.