వైఎస్సార్సీపీలో చేరి పది రోజుల లోపే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యా
వైఎస్సార్సీపీలో చేరి పది రోజుల లోపే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Amabti Rayudu) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన సమయంలో తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని చెప్పిన రాయుడు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావిస్తున్నారు.
అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..ఈయన చేరికతో పార్టీకి ప్లస్ అవుతుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో తాను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతానని, అందుకే రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని చెప్పిన అంబటి రాయుడు హటాత్తుగా పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడం విశేషమే.