HomeInternational

శ్రీల‍ంక క్రికెట్ ను జై షా నాశనం చేస్తున్నాడు ‍- అర్జున రణతుంగ సంచలన ఆరోపణ‌

శ్రీల‍ంక క్రికెట్ ను జై షా నాశనం చేస్తున్నాడు ‍- అర్జున రణతుంగ సంచలన ఆరోపణ‌

ప్రపంచ కప్ లో శ్రీలంక దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యద

బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
Cricket: హ్యాట్రిక్ కొట్టిన‌ ఇండియా… పాక్ పై ఘన విజయం
తన్నుకున్న సినీ తారలు.. ఆరుగురికి గాయాలు, పలువురు ఆసుపత్రి పాలు

ప్రపంచ కప్ లో శ్రీలంక దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి జై షా శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడని శ్రీలంక ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ ఆరోపించారు.

రణతుంగ, ‘ట్రూత్ విత్ చముదిత’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, శ్రీలంక క్రికెట్ బోర్డు SLC అధికారులు , జై షా మధ్య సంబంధం ఉందని ఆరోపించాడు. SLC వ్యవహారాలపై BCCI నియంత్రణ పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.

శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్‌తో BCCI-SLC సంబంధంపై కూడా రణతుంగ మాట్లాడారు.

“SLC అధికారులు, జై షా మధ్య ఉన్న సంబంధం కారణంగా SLCని తొక్కివేయవచ్చు, నియంత్రించవచ్చు అనే భావనలో వారు BCCI ఉన్నది .జై షా శ్రీలంక క్రికెట్‌ను నడుపుతున్నారు. జై షా ఒత్తిడి కారణంగా SLC నాశనమవుతోంది. జై షా శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడు. భారతదేశ హోం మంత్రిగా ఉన్న తన తండ్రి మద్దతుతో అతను శక్తివంతమయ్యాడు. ”అని రణతుంగ చెప్పాడు.

‘స్వయంప్రతిపత్తితో తన వ్యవహారాలను నిర్వహించడంలో’ విఫలమైనందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) SLCని సస్పెండ్ చేసిన నేపథ్యంలో రణతుంగ ఆరోపణలకు బలం చేకూరింది.

మరో వైపు , భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ మహేల జయవర్ధనే ముందుగా బౌలింగ్ చేయమని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్‌ను ఆదేశించారని ఇటీవలి పార్లమెంటు సమావేశంలో శ్రీలంక ఎంపీ విమల్ వీరవన్సా ఆరోపించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇటువంటి సూచన భారతదేశానికి ప్రయోజనం చేకూర్చడానికే అని వీరవన్స‌ ఆరోపించారు.