తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున, అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు , నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఓట్లను రాబట్టడానికి అల్వికాని వాగ్దానాలు గు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున, అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు , నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి ఓట్లను రాబట్టడానికి అల్వికాని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ఏం వాగ్దానాలూ చేస్తున్నారో వారికే అర్దం కానంతగా నోటికి ఏది వస్తే ఆ వాగ్దానం చేస్తున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ చేసిన అటువంటి ఓ వాగ్దానంతో సోషల్ మీడియాలో అయన ట్రోలింగ్ కు గురవుతున్నాడు.
మెదక్ నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో మాట్లాడిన రోహిత్ తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తామని వాగ్దానం చేశాడు.
ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజనులు రోహిత్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సూర్య్డి చుట్టూ భూమి తిరిగ్ఱ్ సమయాన్ని పెంచే మార్గం ఏమైనా కనుక్కొన్నారా ? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే కరెంట్ రోజుకు 48 గంటలిస్తారా వారానికి 48 గంటలా అని మరో నెటిజన్ ప్రశ్నించారు.
మేం అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తాం
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2023
తెలంగాణలో ప్రస్తుతం 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు మేం మేం అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తాం – మైనంపల్లి రోహిత్ pic.twitter.com/dPlOzDZtig