HomeTelanganaPolitics

తీన్మార్ మల్లన్నకు కీలక పదవి కట్టబెట్టిన కాంగ్రెస్

తీన్మార్ మల్లన్నకు కీలక పదవి కట్టబెట్టిన కాంగ్రెస్

తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ కు ఆ పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. తాజాగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవ

ముందుకు సాగుతున్న కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీల్ అమధ్య పొత్తు చర్చలు
ఉపా, అర్బన్ నక్సల్స్ పేరుతో తెలంగాణలో ఎంతో మందిపై కేసులు పెడుతున్నారు : మధు యాష్కి గౌడ్
కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?

తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ కు ఆ పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. తాజాగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం సంగతి తెలిసిందే.

ఆ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే మల్లన్న కు కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించారు.ఈ మేరకు కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ప్రకటన చేశారు.

గతంలో బీజేపీలో చేరిన మల్లన్న.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార బీఆరెస్ తో సహా బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. ఓ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తాము గెలిస్తే తీన్మార్ మల్లన్న తమ సీఎం అభ్యర్థి అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.