ఆ నాయకుడు నిలబెట్టే అభ్యర్థులకు తెలంగాణలో డిపాజిట్లు కూడా వస్తాయో రావో డౌటే. ఏపీలో ఐదు సీట్లైనా గెలుస్తాడా అనేది ప్రశ్నార్దకమే. కానీ ఇప్పుడాయన అంతర్జ
ఆ నాయకుడు నిలబెట్టే అభ్యర్థులకు తెలంగాణలో డిపాజిట్లు కూడా వస్తాయో రావో డౌటే. ఏపీలో ఐదు సీట్లైనా గెలుస్తాడా అనేది ప్రశ్నార్దకమే. కానీ ఇప్పుడాయన అంతర్జాతీయనాయకుడయ్యాడు. విదేశాల్లో జరిగే ఎన్నికలకు కూడా ప్రచారానికి సై అంటున్నాడు. ఈ మాటలు కే ఏ పాల్ గురించి అనుకుంటే పొరపాటే.
తెలంగాణ ఎన్నికల్లో తన అభ్యర్థుల డిపాజిట్లు కాపాడే ప్రచారంలో బిజీగా ఉన్న ప్రముఖ టాలీవుడ్ హీరో , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లండన్ లో జరిగే మేయర్ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నాడు.
గతంలో భారత ప్రధాని మోడీ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించడానికి ప్రచారం చేయగా లేనిది తానెందుకు చేయకూడదని భావించాడేమో పవన్ కళ్యాణ్ కూడా మోడీ బాటలో నడుస్తున్నాడు.
లండన్ మేయర్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ప్రముఖ భారత సంతతి పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. ఆయన తాజాగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ను కలిశారు. తను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు, జనసైనికులు గణనీయంగా ఉన్నారని అందువల్ల వారందరినీ తనకే ఓటేయమని తమరు చెప్పాలని పవన్ ను తరుణ్ గులాటీ బతిలాడుకున్నారట.
గులాటీ వినయవిధేయతలతో పాటు ఇంకేమైనా నచ్చాయేమో కానీ పవన్ గులాటీని గెలిపిస్తానని అభయహస్తం ఇచ్చి ఆశీర్వదించాడట. భారత సంతతి నేత లండన్ ఎన్నికల్లో పోటీ చేయడం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు. తన అభిమానులు, జనసైనికులు, తెలుగువారితో పాటూ భారతీయులంతా తరుణ్ గులాటీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు. అతిత్వరలోనే పవన్ గులాటీని గెలిపించవలసిందిగా ఓ వీడియో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. పవన్ మద్దతుతో పవన్ అభిమానులు, తెలుగువాళ్ళు, ఇతర భారతీయులే కాక లండన్ లోని ఇంగ్లీషు వాళ్ళు కూడా ఓట్లేయడం , త్వరలోనే తాను నల్ల గౌను వేసుకొని మేయర్ కుర్చీలో కుర్చోవడం ఖాయమని గులాటీ సంబరపడిపోతున్నాడట.