HomeTelanganaPolitics

కేసీఆర్ పై కామారెడ్డిలో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి… ఈ నెల 8వ తేదీన నామినేషన్

కేసీఆర్ పై కామారెడ్డిలో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి… ఈ నెల 8వ తేదీన నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, పార్టీల వ్యూహాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో వైపు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకుల జంపింగులు కూడా పెరిగిపోయాయ

ఉచిత విధ్యుత్తు వ్యాఖ్యలపై రేవంత్ తొలి స్పందన…ఇకనైనా రచ్చ ఆగేనా?
బీఆర్ఎస్ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు అరెస్ట్
పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, పార్టీల వ్యూహాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో వైపు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకుల జంపింగులు కూడా పెరిగిపోయాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని రాజకీయ పరిస్థితి అంచనా వేస్తున్న విశ్లేషకులు చెప్తున్నారు. ఎవరి గెలుపైనా అంత సులబం కాదని అంటున్నారు. మరో వైపు బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ గజ్వెల్, కామారెడ్డి రెండు స్థానాల నుండి పోటీ చేస్తుండగా ఆయనను ఓడించేందుకు గజ్వెల్ లో బీజేపీ నాయకుడు ఈటల రాజేంధర్ పోటీకి దిగారు.

మరో వైపు ఎప్పటి నుంచీ ప్రచారంలో ఉన్నట్టు గానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై పోటీకి దిగనున్నారు. రేవంత్ కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన కామారెడ్డిలో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. రేవంత తన స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో కూడా పోటీ చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన కొడంగల్‌లో ఆయన‌ నామినేషన్ వేయనున్నారు. రేవంత్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతుండడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. షబ్బీర్ అలీ నామినేషన్‌కి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు.