తోకముడిచిన పిరికిపందలు కేసీఆర్, ఒవైసీ బీజేపీకి భయపడి 9 సీట్లకే పోటీ చేస్తూ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు
తోకముడిచిన పిరికిపందలు కేసీఆర్, ఒవైసీ
బీజేపీకి భయపడి 9 సీట్లకే పోటీ చేస్తూ పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం
బీఆర్ఎస్ ను గెలిపించేందుకు మజ్లిస్ తంటాలు
వావివరసలు కూడా మార్చేసిన ఒవైసీ
మామ సంగతి చూస్తాం… అల్లుడి సంగతి చూస్తాం…
హిందుత్వంతోనే గెలిచానని గర్వంగా చెబుతా
పాతబస్తీలో సభ పెడితే నా భార్యను చంపుతానని బెదిరించినా భయపడలే
వేలాదిమందితో సభ పెట్టి కాషాయ జెండా సత్తా చాటిన
నా గెలుపు ఖాయమని కేసీఆర్ సర్వేలే చెబుతున్నయ్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
జూబ్లీనగర్ లో పెద్ద ఎత్తున బీజేపీలో చేరిన నాయకులు
• ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిరికిపందలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీని నేరుగా ఢీకొనలేక ఆ ఇద్దరు నేతలు పరస్పర ఒప్పందంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. తెలంగాణ అంతటా ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించి సత్తా చాటుతామని ప్రగల్భాలు పలికిన ఒవైసీ మాట తప్పి పిరికిపందలా పారిపోయారనక్నారు. కేసీఆర్ మామను మళ్లీ సీఎం చేసేందుకు యూ టర్న్ తీసుకుని పాతబస్తీలోని 9 స్థానాలకే పరిమితమైన పిరికిపంద ఒవైసీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం వావివరసలను మార్చేసి కేసీఆర్ ను మామ అంటూ సంబోధిస్తున్నారని విమర్శించారు.
• అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ ఈరోజు జూబ్లి నగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కరీంనగర్ రూరల్ మండల విస్త్రత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన రేగుల రమేశ్, పూజల రాజేశం, ఆకుల శ్రీనివాస్ సహా పలువురు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన రూరల్ మండల నాయకులు, పోలింగ్ బూత్ సభ్యులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
• కరీంనగర్ లో బీజేపీ గెలవడం తథ్యమని ముఖ్యమంత్రి కేసీఆరే చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్ధికి చాలారోజుల పాటు బి.ఫాం కూడా ఇవ్వలేదన్నారు. ఇది తెలిసే ఒట్ల కోసం, అసెంబ్లీ సీటు కోసం ఎంఐఎం టోపీ పెట్టుకుని దారుస్సలాం పోయి ఒవైసీకి మోకరిల్లిన చరిత్ర బీఆర్ఎస్ అభ్యర్ధిది. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ లో 30 సీట్లు ఎంఐఎంకు కేటాయించి గెలిపించడంతోపాటు మేయర్ పదవిని కూడా ఆ పార్టీకే కేటాయించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గులాబీ జెండాను పక్కనపెట్టి పచ్చ జెండా పట్టుకుని పచ్చటోపీ పెట్టుకుని మసీదులకు పోయి నమాజ్ చేస్తున్నారు. ఓట్ల కోసం దేనికైనా దిగజారే వ్యక్తిత్వం ఆయనదే.
• నేను ఏనాడూ ఓట్ల కోసం దిగజారలే. నేను కూడా ఆయన మాదిరిగా పచ్చటోపీ పెట్టుకుని, పచ్చ జెండాను పట్టుకుని మసీదులకు వెళ్లి ఉంటే 2014, 2018 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యేవాడినన్నారు. కానీ ఆ పనిచేయలేదు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయలేను. హిందూ ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా. నేను గెలిస్తే హిందుత్వ సిద్ధాంతంతో గెలిచిన ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకుంటా.
• తెలంగాణలో 12 శాతమున్న ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి పాతబస్తీలో ఎంఐఎం సీట్లను గెలుచుకుంటుంటే… 80 శాతమున్న హిందూ ఓటర్లను ఏకం చేసి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు. అందుకోసమే నేను పనిచేస్తున్నా.
• పాతబస్తీలో సభ పెడితే నా భార్యను చంపేస్తామన్నారు. నా పిల్లలను కిడ్నాప్ చేస్తామని కొంతమంది ఆనాడు అన్ నోన్ నెంబర్ నుండి ఫోన్ చేసి హెచ్చరించారు. అయినా నేను భయపడలేదు. పాతబస్తీలో వేలాది మంది సభ పెట్టి కాషాయ జెండా సత్తా చాటిన.
• ఒకనాడు పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుందని హేళన చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను అదే భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రప్పించి పూజలు చేసేలా చేసిన ఘనత బీజేపీదే.
• ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత ఒవైసీ పిరికిపందలు. బీజేపీని నేరుగా ఢీ కొట్టలేక పరస్పర ఒప్పందంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణ అంతటా పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ యూ టర్న్ తీసుకుని పారిపోయిండు. పాతబస్తీలోని 9 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైండు. తెలంగాణలో మహిళల జోలికొస్తే సహించే ప్రసక్తే లేదు. అమ్మలక్కల జోలికొస్తే వీపంతా సాఫ్ చేస్తా.