HomeTelanganaUncategorized

గోబెల్స్ ప్రచారంతో ఎన్నికల్లో గెలవలేరుప్రశాంత పారిశ్రామిక నగరంలో రౌడీలకు తావులేదు

గోబెల్స్ ప్రచారంతో ఎన్నికల్లో గెలవలేరుప్రశాంత పారిశ్రామిక నగరంలో రౌడీలకు తావులేదు

గోబెల్స్ ప్రచారంతో ఎన్నికల్లో గెలవలేరుప్రశాంత పారిశ్రామిక నగరంలో రౌడీలకు తావులేదు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల అప్పుడు మాత్రమే కనబడే ఒక ప్ర

మీ పిలుపు కోసం నిలువెల్ల చెవులై… కేసీఆర్ ను ఒదిలేసినట్టేనా ?
స్కూల్ నే బార్ కమ్ లాడ్జిగా మార్చేసిన‌ టీచర్!
ఇజ్రాయిల్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా

గోబెల్స్ ప్రచారంతో ఎన్నికల్లో గెలవలేరు
ప్రశాంత పారిశ్రామిక నగరంలో రౌడీలకు తావులేదు

ఎమ్మెల్యే కోరుకంటి చందర్

ఎన్నికల అప్పుడు మాత్రమే కనబడే ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి తనపై బురద జల్లడమే పనిగా గోబెల్స్ ప్రచారాన్ని చేస్తున్నాడని ఆ ప్రచారాలతో ఎన్నికల్లో గెలవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని రామగుండం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ అన్నారు. ప్రస్తుతం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం అవాంచనీయ సంఘటనలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారని, మళ్లీ రౌడీ రాజ్యం తేవాలనుకోవడం బ్రమే అవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం ఉద్యమాల ప్రాంతమని ఉద్యమకారులకే ఇక్కడ స్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ప్రజలు చైతన్యంగా లేని సమయంలో ఇక్కడ రౌడీలు రాజ్యమేలారని ప్రజా చైతన్యంతో రౌడీయిజం ఈ ప్రాంతంలో అంతమొందించబడిందని ఆయన గుర్తు చేశారు. అడుక్కుతినే స్థాయి నుండి రౌడీయిజాన్ని ఆసరా చేసుకొని కోట్లు గడించిన వాళ్లు ప్రజాప్రతినిధులు అవుతే జనజీవనం అంధకారం అవుతుందని అందరికీ తెలిసిన విషయమేనని చందర్ అన్నారు. ముల్లును ముల్లుతోనే తీసే చాకచక్యం తమకు ఉందని గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టే కార్యాచరణలో ఉన్నామని ఆయన అన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లాంటి సంబంధంలేని అంశాలను అంటగట్టే ప్రక్రియ కొంతకాలంగా కొందరు దుర్మార్గులు చేస్తున్నారని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే లాగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే ..దొంగ దొంగ అని అన్నట్లుగా కొందరి వ్యవహారం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే దానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తే వారే ఆహుతి అవుతారని ఆయన అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నానని ఏ కష్టం వచ్చినా పెద్ద కొడుకు లాగా వారికి అండగా ఉంటానని ఆయన పునరుద్గాటించారు. ప్రజల మనసుల్లో ఉన్న తనను గొబెల్స్ ప్రచారంతో నష్టం కలిగించాలనుకోవడం బ్రమే అవుతుందని ఆయన హితవు పలికారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల అభివృద్ధి పారిశ్రామిక ప్రాంతంలో జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలో మురికి కూపంలా తయారైన పారిశ్రామిక నగరం సుందర నగరం గా మారిందని, ఇక్కడ నివసించే ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం లో జీవనం సాగిస్తున్నారని రౌడీ చేష్టలతో ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దని ఆయన హితవు పలికారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేశామో ఏం చేయగలుగుతామో చెప్పాలని వ్యక్తిగత దూషణలకు దిగితే అదే స్థాయిలో సమాధానాలు ఉంటాయని ఆయన అన్నారు.