HomeTelanganaPolitics

BRS టూ BRS వయా కాంగ్రెస్

BRS టూ BRS వయా కాంగ్రెస్

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయనాయకుల కండువాలు కూడా అత్యంత స్పీడ్ గా మారిపోతున్నాయి. నిన్న ఓ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో

మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్
BSP నుంచి BRS పార్టీలో చేరికలు

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయనాయకుల కండువాలు కూడా అత్యంత స్పీడ్ గా మారిపోతున్నాయి. నిన్న ఓ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం చాలా కష్టమైంది.

రెండువారాల క్రితం బీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎల్బీ నగర్ నియోజకవర్గ నాయకుడు రామ్మోహన్ గౌడ్ ఈ రోజు మళ్ళీ స్వంత గూటిలో చేరిపోయారు. బుధవారం సీనియర్‌ నేత, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఆయన‌తో పాటు ఆయన సతీమణి, మాజీ కార్పొరేటర్ లక్ష్మీపసన్నగౌడ్, పలువురు ఆయన అనుచరులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు.
రామ్మోహన్ గౌడ్ 2018 ఎన్నికలలో BRS అభ్యర్థి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి D. సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సుధీర్ రెడ్డి BRS లోకి ఫిరాయించారు.
కాగా బీఆరెస్ ఎల్ బీ నగర్ టికట్ ను మళ్ళీ సుధీర్ రెడ్డికే కేటాయించడంతో అసంత్రుప్తికి లోనైన రామ్మోహన్ గౌడ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకు మొండిచేయే చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ బీ నగర్ టికట్ ను మధుయాష్కీ గౌడ్ కు కేటాయించింది. దాంతో రామ్మోహన్ గౌడ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా అసంత్రుప్తికి గురయ్యి ఈ రోజు మళ్ళీ బీఆరెస్ లో చేరారు.