HomeTelanganaPolitics

బీజేపీకి రాజీనామా చేసి కా‍ంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి

బీజేపీకి రాజీనామా చేసి కా‍ంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి

కొంతకాలంగా సాగుతున్న ప్రచారమే నిజమయ్యింది. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు, ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మెన్ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు

12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ
కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
బీజేపీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే

కొంతకాలంగా సాగుతున్న ప్రచారమే నిజమయ్యింది. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు, ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మెన్ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయిన తర్వాత బీజేపీకి తన రాజీనామాను ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు. ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.

వివేక్ వెంకట స్వామి శంశాబాద్ లోని నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీని కలుసుకొని చర్చలు జరిపారు. అనంతరం ఆయన తన కుమారుడు వంశీతో సహా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత‌ ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి చీడలా పట్టిన బీఆరెస్ ను ఓడించేందుకు తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు చెప్పారు. పార్టీ ఏ పని అప్పజెప్పినా చేయడానికి తాను సిద్దమని, టికట్ కోసం తాను కాంగ్రెస్ లోకి రాలేదన్నారు.