HomeTelanganaPolitics

BRSలోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి.. కేసీఆర్ తో సమావేశం

BRSలోకి నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి.. కేసీఆర్ తో సమావేశం

కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ టికట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీ హిల్స్ టికట్ ఇవ్వకపోవడంతో పీజేఆర్ కుమారుడు విష్ణు వర్

BRS టూ BRS వయా కాంగ్రెస్
ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్

కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ టికట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీ హిల్స్ టికట్ ఇవ్వకపోవడంతో పీజేఆర్ కుమారుడు విష్ణు వర్దన్ రెడ్డిలు ఈ రోజు బీఆరెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇప్పటికే నాగం కాంగ్రెస్ కు రాజీనామా చేయగా , విష్ణు త్వరలో రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ బీఆరెస్ లో చేరనున్నారు.

కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను ఈ రోజు మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావులు కలిశారు. ఆయనను బీఆరెస్ లోకి ఆహ్వానించారు. వారి మధ్య చర్చల అనంతరం నాగం ప్రగతి భవన్ కు వెళ్ళి కేసీఆర్ ను కలిశారు. నాగం రాజకీయ్ అభవిశ్యత్తు గురించి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన బీఆరెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

ఇక మొదటి నుంచి తండ్రి బాటలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విష్ణు వర్దన్ రెడ్డి జూబ్లీ హిల్స్ టికట్ ఆశించి బంగపడ్డారు. ఆ టికట్ ఖచ్చితంగా తనకే వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న విష్ణు టికట్ దక్కకపోవడంతో రేవంత్ పై దుమ్మెత్తి పోశాడు. ఈ నేపథ్యంలో అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ను కలిశారు. విష్ణు కూడా త్వరలోనే బీఆరెస్ లో చేరనున్నారు.