HomeInternational

గాజాలో ఇజ్రాయిల్ నరమేధం – ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారి మృతి

గాజాలో ఇజ్రాయిల్ నరమేధం – ప్రతి 15 నిమిషాలకు ఓ చిన్నారి మృతి

గాజాపై 11 రోజుల వైమానిక దాడుల్లో 1,000 మందికి పైగా పిల్లలు మరణించారని రిపోర్టులు చెప్తున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక బాలుడు/బాలిక మరణిస్తున్నారు. గాజ

ఇజ్రాయిల్ పై హమస్ దాడికి ఇరాన్ మద్దతు
ఇజ్రాయిల్ పై 5వేల రాకెట్లతో దాడి చేసిన హమస్
ఇజ్రాయిల్ కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా

గాజాపై 11 రోజుల వైమానిక దాడుల్లో 1,000 మందికి పైగా పిల్లలు మరణించారని రిపోర్టులు చెప్తున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక బాలుడు/బాలిక మరణిస్తున్నారు. గాజాలో మొత్తం మరణాలలో మూడవ వంతు మంది పిల్లలు ఉన్నారని ‘సేవ్ ది చిల్డ్రన్’ సంస్థ తెలిపింది.

గాజాపై పూర్తిగా ఇజ్రాయిల్ ముట్టడి కొనసాగుతున్నందున, ఇప్పటికే పరిస్థితి దారుణంగా దిగజారి‍ంది. ఒకవైపు ఇజ్రాయిల్ విమానదాడులు, బాంబులతో గాజాపై విరుచుకపడుతుండటంతో ఆ దాడుల్లో మరణిస్తున్న వారే కాక. త్వరలో అక్కడ ఆకలితో, దాహంతో మరణించేవారు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గాజాలో తాగు నీరు అయిపోయింది. ఆహారం లేదు.దీంతో ప్రజలు – ముఖ్యంగా చిన్న పిల్లలు – త్వరలో తీవ్రమైన డీహైడ్రేషన్‌తో చనిపోతారని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్టోబరు 15న దక్షిణ గాజాకు నీటి సరఫరాను పునఃప్రారంభించిందని నివేదికలు సూచిస్తుండగా, గాజా స్ట్రిప్‌లో కరెంటు లేకపోవడంతో నాలుగు రోజుల తర్వాత కూడా పవర్-ఆధారిత నీటి పంపులు పనిచేయడం లేదు.

మూడు రోజుల క్రితం , గాజాలోని అన్ని ఆసుపత్రులలో బ్యాకప్ జనరేటర్లను ఆపరేట్ చేయడానికి 48 గంటల ఇంధనం మాత్రమే మిగిలి ఉందని, దీనివల్ల పిల్లలతో సహా వేలాది మంది రోగులు తీవ్ర ప్రమాదంలో పడనున్నారని UN హెచ్చరించింది.

“గాజా పిల్లల కోసం నీరు అయిపోతోంది, సమయం మించిపోయింది” అని సేవ్ ది చిల్డ్రన్స్ కంట్రీ డైరెక్టర్ జాసన్ లీ అన్నారు. ” ”పిల్లల ప్రాణాలను కాపాడటానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పక అంగీకరించాలి. పోరాటానికి ముగింపు లేకుండా – కాల్పుల విరమణ లేకుండా – వేల మంది పిల్లల బతకడం కష్టం.” అని ఆయన అన్నారు.

పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 4,385 కు పెరిగింది, అక్టోబర్ 7 నుండి 17,000 మందికి పైగా గాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితి ప్రకారం, 11 రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 4,200 మంది మరణించారు, కేవలం 10 రోజులలో ఒక పది లక్షల కన్నా ఎక్కువ మంది ప్రజలు గాజా నుంచి వలస వెళ్ళిపోయారు. గాజా స్ట్రిప్‌లోని అనేక‌ ప్రాంతాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

మృతుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉన్నారు, అలాగే కనీసం 11 మంది పాలస్తీనియన్ జర్నలిస్టులు, 28 మంది వైద్య సిబ్బంది , 14 మంది UN సిబ్బంది మరణించారు. శిథిలాల మధ్య ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో అస్పష్టంగానే ఉంది. చాలా మంది కనపడని తమ కుటుంబ సభ్యుల కోసం శిథిలాల కింద వెతుకులాడ్ఫుతున్నారు.

ఇజ్రాయిల్ ఆస్పత్రుల మీద కూడా దాడులు చేస్తుండటంతో అనేక ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. ఓ అంచనా ప్రకారం దాదాపు 50,000 మంది గర్భిణీ స్త్రీలకు, అలాగే దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య సంరక్షణ అందుబాటులో లేకుండా పోయింది.