HomeTelangana

C Voter సర్వే పై మండిపడ్డ‌ BRS, తమ‌ గెలుపు ఖాయని వ్యాఖ్య‌

C Voter సర్వే పై మండిపడ్డ‌ BRS, తమ‌ గెలుపు ఖాయని వ్యాఖ్య‌

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ABP-C Voter సర్వే తేల్చడంపై BRS మండిపడింది. ఈ సర్వేలు ఓ కుట్ర అని

‘పల్లెపల్లెనా ప్రజా కోర్టులు పెడదాం… తిరగబడదాం.. తరిమి కొడదాం…’
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు
BRSకు షాక్… GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లోకి ?

తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ABP-C Voter సర్వే తేల్చడంపై BRS మండిపడింది. ఈ సర్వేలు ఓ కుట్ర అని బీఆరెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

దాదాపు 50పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థులు కూడా దొరకని కాంగ్రెస్‌ 62 స్థానాల్లో గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదమని శ్రవణ్‌ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ అనేక వైరుధ్యాలు, విభేదాలు , గందరగోళాలతో సీట్లను ప్రకటించలేక పోయిందని చెప్పిన ఆయన‌ సందేహాస్పద సర్వేలను ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను గందరగోళానికి గురి చేయడం CVoter ఒపీనియన్ పోల్ సర్వే కుట్ర అని మండిపడ్డారు.

ఇలాంటి కుట్రలు వారు 2018 సంవత్సరంలో చేసారని, 2023 సంవత్సరంలో కూడా మరోసారి చేస్తున్నారని శ్రవణ్ అన్నారు. వారి నకిలీ సర్వేలు ఫలితాలు వెలువడే డిసంబర్ 3వ తేదీన బహిర్గతమవుతాయన్నారు శ్రవణ్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మూడోసారి గెలుపొందడం దరిదాపుల్లో కూడా లేదని ఆయన తెలిపారు. బూటకపు సర్వేలు, తప్పుడు కథనాలతో అధికారం పొందాలన్న ఆశ ఎప్పటికీ విజయం సాధించదన్న శ్రవణ్ తెలంగాణకు కేసీఆర్ కావాలి.. ప్రజలు కేసీఆర్‌ను ప్రేమిస్తారు.. కేసీఆర్ తెలంగాణను ప్రేమిస్తున్నారు. అని అన్నారు.