ఇజ్రాయిల్ పై తాము చేసిన దాడికి ఇరాన్ మద్దతు ఉన్నట్టు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమస్ ప్రకటించింది. నిన్న ఒకే సారి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పై ప్రయోగి
ఇజ్రాయిల్ పై తాము చేసిన దాడికి ఇరాన్ మద్దతు ఉన్నట్టు పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమస్ ప్రకటించింది. నిన్న ఒకే సారి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పై ప్రయోగించి, ఇజ్రాయిల్ లోకి చొచ్చుకెళ్ళిన హమస్ ఇజ్రాయిల్ పై తమది న్యాయమైన పోరాటమని చెప్పింది.
హమాస్ ప్రతినిధి ఘాజీ హమద్ బిబిసితో మాట్లాడుతూ, మీడియా ఉదహరించినట్లుగా, శనివారం తాము ఇజ్రాయెల్‌పై ఆకస్మిక బహుళ- దాడిని ప్రారంభించడానికి ఇరాన్ తన మద్దతునిచ్చిందని చెప్పారు.
కాగా, ఇజ్రాయెల్‌పై హమాస్ శనివారం జరిపిన దాడులు పాలస్తీనియన్ల ఆత్మరక్షణ చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ముస్లిం దేశాలన్నీ పాలస్తీనియన్ల హక్కులకు మద్దతు ఇవ్వాలని కోరింది. ఇజ్రాయిల్ పై మెరుపుదాడులు చేసిన హమాస్‌కు అభినందలు తెలిపారు ఇరాన్‌కు చెందిన ఓ ప్రభుత్వాధికారి.
మరో వైపు ఇజ్రాయిల్ కూడా గాజాపై తన దాడిని ప్రారంభించింది. దీంతో రెండువైపులా 500కు పైగా ప్రజలు మరణించినట్టు సమాచారం. దాదాపు 1500మంది ప్రజలు గాయపడ్డారు.