HomeTelangana

ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్యే సీతక్కను సెక్రటేరియట్ లోకి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు

తన నియోజకవర్గం పనులకోసం ఈ రోజు సచివాలయంలో పలువురు అధికారులను కలవడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క వచ్చారు. అయితే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని సచివాల

BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డి లాంటి వారిని ఎంతో మందిని మట్టికరిపించాం, ఆయనో లెక్కా -కేటీఆర్
బీఆర్ఎస్ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు అరెస్ట్

తన నియోజకవర్గం పనులకోసం ఈ రోజు సచివాలయంలో పలువురు అధికారులను కలవడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క వచ్చారు. అయితే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని సచివాలయంమెయిన్ గెట్ ముందు ఉన్న పోలీసులు ఆమె కారును ఆపేశారు. ఆమెను లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు.

సెక్రటేరియట్ లోనికి ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వరా అంటూ సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు వినలేదు తమకున్న ఆదేశాలనుసారం తాము పని చేస్తామని వారు స్పష్టం చేశారు. దాంతో సీతక్క కారు దిగి నడిచి సచివాలయంలోకి వెళ్ళారు.

ఈ విషయం తెలిసినా మీడియా ప్రతినిధులు సీతక్క తిరిగి వచ్చేప్పుడు కలవడానికి మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసు అధికారులు. సీతక్క వచ్చేప్పుడు ఆమెను మళ్ళీ అడ్డుకున్నారు. ఆమెను మెయిన్ గేట్ వైపు రాకుండా చేసి మరో గూండా బైటికి పంపారు.
అయితే ఆమె బైటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరుపై సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ‘‘వివిధ శాఖలకు సంబంధించిన పనులపై సెక్రటేరియట్‌కు వచ్చాను. లోపలికి వెళ్తుంటే పోలీసులు నన్ను అడ్డుకున్నారు.” అని తెలిపారు.

సచివాలయం నిర్మాణం గురించి గొప్పగా చెప్తున్న కేసీఆర్ సర్కార్ ప్రపక్ష ఎమ్మెల్యేలను లోపలికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల వద్దకు రాడు. ప్రజాసమస్యలను తీసుకొని మేము సచివాలయానికి వస్తే మమ్ములను లోపలికి రానివ్వరు. సెక్రటేరియట్ ఉన్నది బీఆరెస్ నేతల కోసమేనా ? ప్రజల కోసం కాదా ? ప్రశ్నించేవాళ్ళు, ప్రతిపక్షాలకు సచివాలయంలోకి అనుమతి లేదు అని బోర్డు పెట్టండి.” అని సీతక్క మండిపడ్డారు.