HomeTelangana

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల బృందం మంగళవారం నగరానికి వచ్చిం

అసెంబ్లీలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు…స్వంత పార్టీపైనే విమర్శలు
టీడీపీ, జనసేన కూటమి తరపున పోటీ చేస్తా – వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
300 మంది యువకులకు భజరంగ్ దళ్ సాయుధ శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల బృందం మంగళవారం నగరానికి వచ్చింది.

మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (CEC) మంగళవారం మధ్యాహ్నం రాజకీయ పార్టీలతో సమావేశమైంది. అధికార భారత రాష్ట్ర సమితి BRS తో సహా 10 వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 30 మందికి పైగా నాయకులు CEC అధికారులను కలుసుకుని వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే కొన్ని ఫిర్యాదులు చేశారు.
నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ బృందం 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ రివిజన్‌ను చేపట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది.

బీజేపీ BJP, తెలుగుదేశం TDP, సీపీఐ CPI, ఆమ్‌ ఆద్మీ పార్టీ AAP, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ YSRCPపార్టీలతోపాటు అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు సీఈసీ అధికారులను కలిసి వేర్వేరుగా ఫిర్యాదులు చేశాయి.

అనంతరం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సీఈసీ బృందం 22 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల బృందాలతో సమావేశం నిర్వహించింది.

బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశయ్యింది. జిల్లాల వారీగా ఎన్నికల సన్నాహకాలు, ప్రణాళికలను సమీక్షించనున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రణాళికలను అధికారులు వివరించనున్నారు.

ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, ప్రలోభాల విషయమై ఈసీ ఎక్కువగా దృష్టి సారించనుంది. హైదరాబాద్, చుట్టపక్కల ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, డూప్లికేట్ ఓట్లు, తొలగింపు తదితర అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నందున వాటి విషయమై ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, బందోబస్తు ప్రణాళికలు, సరిహద్దు నియోజకవర్గాల్లో పర్యవేక్షణ, చెక్ పోస్టులు తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఈ సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమవుతారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో అవగాహన , భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి CEC బృందం గురువారం రాష్ట్రంలోని ప్రముఖులు , వికలాంగులు, యువ ఓటర్లతో సంభాషిస్తుంది. చివరి రోజు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు.