HomeNational

ప్రకృతి విపత్తులకు మాంసాహారమే కారణమట!

ప్రకృతి విపత్తులకు మాంసాహారమే కారణమట!

ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి విపత్తులకు శాస్త్రఙులు ఎన్నో కారణాలు వివరిస్తున్నారు. మానవులు పర్యావరణాన్ని నాశనం చేయడం ఒక కారణం కాగా, పర్యావరణ నాశనం చే

మోడీ మళ్ళీ ఏడ్చాడు
అయోద్యలో 14.5 కోట్లతో ప్లాట్ కొన్న అమితాబ్
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు

ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి విపత్తులకు శాస్త్రఙులు ఎన్నో కారణాలు వివరిస్తున్నారు. మానవులు పర్యావరణాన్ని నాశనం చేయడం ఒక కారణం కాగా, పర్యావరణ నాశనం చేయని కాలంలో ప్రకృతి విపత్తులు జరగలేదా ? అంటే అప్పుడు కూడా జరిగాయి. ఇప్పుడు మరింత ఎక్కువ జరుగుతున్నాయి. అయితే ప్రకృతి విపత్తులకు మనుషులు మాంసాహారం తినడమే కారణమని చెప్పి ఓ ఐఐటీ ప్రొఫెసర్ ప్రపంచ ప్రజల కళ్ళు తెరిపించారు. ఆయన అక్కడితో ఆగలేదు. మాంసాహారం తినబోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని IIT మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా ప్రక్రుతి విపత్తులు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై కొత్త సిద్దాంతం తయారు చేశారు. అందుకోసం సరికొత్త లాజిక్ లు వెతుక్కొచ్చారు.

ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, “హిమాచల్ ప్రదేశ్ గణనీయమైన పతనం అంచుకు చేరుకోబోతోంది. అలా జరగకుండా ఉండాలంటే జంతువులనుచంపి తినడం మానేయండి. మీరు అక్కడ అమాయక జంతువులను చంపుతున్నారు. దాని వల్ల పర్యావరణం నాశనమైపోతోంది” అన్నారాయన.

“ఇది కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు పదే పదే జరుగుతున్నాయి. ఇవన్నీ జంతువులపై మనం చూపిస్తున్న క్రూరత్వం ప్రభావాలే… ప్రజలు మాంసం తినడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి.” అని బెహెరా విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
“మంచి మానవులుగా మారడానికి, మీరు ఏమి చేయాలి? మాంసం తినడం మానేయాలి.” అని చెప్పిన ఆయన మాంసం తినకూడదని ప్రతిజ్ఞ చేయమని విద్యార్థులను కోరాడు.

ఐఐటీ డైరెక్టర్ బెహరా మాట్లాడిన మాట‌లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అనేక వైపుల నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది.
“పతనం పూర్తయింది. ఇలాంటి మూఢ మూర్ఖులు దేన్నైనా నాశనం చేస్తారు” అని పారిశ్రామికవేత్త , IIT ఢిల్లీ పూర్వ విద్యార్థి సందీప్ మనుధనే X లో పోస్ట్ చేశారు.

బయోఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో, ఐఐటి మండి డైరెక్టర్ వంటి అభిప్రాయాలు ఇక్కడ కనిపించడం ఒక లక్షణం, ఇది బగ్ కాదు. ఇది చాలా విచారకరం.” అన్నాడాయన.
బెహరా తన వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, అతను “పవిత్ర మంత్రాలు” పఠించడం ద్వారా తన స్నేహితుడి అపార్ట్‌మెంట్ ను, కుటుంబాన్ని “దుష్ట ఆత్మల” నుండి విముక్తి చేయడానికి భూతవైద్యం లో పాల్గొన్నానని ప్రకటించి కలకలం సృష్టించారు.

ఆయనపై విమర్శలు కొనసాగుతున్నప్పటికీ బెహరా మాత్రం నోరు మెదపడం లేదు. ఈ వివాదంపై బెహెరా నుంచి ఎలాంటి స్పందన లేదు.