మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్)ఈ నెల 2న మందమర్రి యాపల్ గ్రామానికి చెందిన నిట్టూరి సరిత కొమురాజు రాములు కు సంబంధించిన మేక దొంగతనం చేశ
మంచిర్యాల ప్రతినిధి సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్)
ఈ నెల 2న మందమర్రి యాపల్ గ్రామానికి చెందిన నిట్టూరి సరిత కొమురాజు రాములు కు సంబంధించిన మేక దొంగతనం చేశారని తన అక్క కొడుకు కిరణ్ ను తలకిందులుగా వేలాడదీసి,కింద మంటపెట్టి రాములు,అతని కొడుకు శ్రీనివాస్,భార్య స్వరూప,మరో వ్యక్తి నరేష్ లతో కలిసి తీవ్రంగా హింసించారని ఫిర్యాదు చేయగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు బెల్లంపల్లి ఎసిపి సదయ్య తెలిపారు.ఈ మేరకు మందమర్రి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కిరణ్ అనే యువకుడిని కొమురాజు రాములు కు చెందిన మేకలు దొంగతనం చేశాడనే అనుమానంతో అతనితో పాటు స్నేహితుడైన కుక్కల తేజ లను తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురిచేశాడని తెలిపారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదు మేరకు ఆదివారం మందమర్రి యాపల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని చుట్టు ప్రక్కల ప్రజలతో మాట్లాడి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి విచారణలో నేరం రుజువు అయినందున నిందితులపై ఎస్సి,ఎస్టి అట్రాసిటీ,హత్యాయత్నం చట్టాల క్రింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.