HomeNational

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిది; దాన్ని నిర్మూలించాలి – ఉధయనిధి స్టాలిన్

సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిది; దాన్ని నిర్మూలించాలి – ఉధయనిధి స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉధయనిధి స్టాలిన్, సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, కాబట్టి దీనిని కేవలం వ్యతిరేకి

తెలంగాణ రైతులకు ఇండిపెండెంట్ ‍డే గిఫ్ట్.. లక్ష లోపు రుణాల మాఫీ
మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్న కేసీఆర్.. తెరపైకి సమైక్యవాదం
ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉధయనిధి స్టాలిన్, సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని, కాబట్టి దీనిని కేవలం వ్యతిరేకించడం మాత్రమే చేయకూడదని, దీనిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే లక్ష్యంతో జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు.

సదస్సును ఉద్దేశించి ఉధయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ఈ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ‘సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం’ అనే బదులు ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించండి’ అని సదస్సుకు పిలుపునిచ్చినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నాను.” అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, ”మనం నిర్మూలించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కేవలం మనం వ్యతిరేకించి ఊరుకోలేము. దోమలు, డెంగ్యూ జ్వరం, మలేరియా, కరోనా, వీటన్నింటినీ మనం వ్యతిరేకించి ఊరుకోలేము. వాటిని మనం నిర్మూలించాలి. సనాతనం కూడా అలాంటిదే.’’ అన్నారు

‘సనాతనాన్ని నిర్మూలించడం, వ్యతిరేకించడం మన ముందున్న ముఖ్యమైన పని. సనాతనం అంటే ఏమిటి? సనాతనం అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది. సనాతనం సమానత్వానికి, సామాజిక న్యాయానికి విరుద్ధం. సనాతనం అర్థం ‘శాశ్వతం’ తప్ప మరొకటి కాదు, అది మార్చలేనిది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు. సనాతనం అంటే ఇదే.’ అని ఉధయనిధి స్టాలిన్ అన్నారు.