HomeTelanganaCrime

కోరుట్ల దీప్తిని చంపింది స్వంత చెల్లెలే!

కోరుట్ల దీప్తిని చంపింది స్వంత చెల్లెలే!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె చెల్లెలు చందననే దీప్తిని చంపిందని తేల్చారు. పో

బట్టబయలైన 250 కోట్ల భారీ కుంభకోణం
దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకునే వ్యక్తి కేసీఆర్ -మోత్కుపల్లి సంచలన కామెంట్స్
మేక దొంగతనం నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితుల అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె చెల్లెలు చందననే దీప్తిని చంపిందని తేల్చారు.

పోలీసుల కథనం ప్రకారం…
ఒంగోలుకు చెందిన బి.శ్రీనివాస్‌రెడ్డి కొన్నేళ్ళ క్రితం జగిత్యాల జిల్లా కోరుట్లలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు , ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నది. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి దగ్గరే ఉంటున్నది. రెండో కూతురు చందన ఈ మధ్యనే బీటెక్ అయిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నది.

చందన హైదరాబాద్ లో బీటెక్ చేస్తున్న సమయంలో ఉమర్ అనే వ్యక్తిని ప్రేమించింది. పోయిన నేల 29వ తేదీన .శ్రీనివాస్‌రెడ్డి, అతని భార్య మాధవిలు 28వ తేదీన హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు వెళ్ళారు. అది సరి అయిన సమయం అని భావించిన చందన ఫోన్ చేసి ఉమర్ ను రప్పించింది. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్ వచ్చే లోపే తన అక్క దీప్తితో ఓడ్కా తాగించి నిద్ర పుచ్చింది. అనంతరం వచ్చిన ఉమర్ , చందనలు కలిసి ఇంట్లోని లక్షా 20 వేల రూపాయల నగదు, బంగారం తీసుకొని వెళ్ళిపోదామని ప్రయత్నించేలోపే దీప్తి నిద్ర లేచి వీళ్ళు చేస్తున్న పని చూసు అరిచింది. దాంతో చందన దీప్తి నోరు, ముక్కు లపై టేపును అంటించి, చున్నీతో చేతులు కట్టేసింది. కొద్ది సేపట్లోనే ఊపిరాడక దీప్తి మృతి చెందింది. ఆమె మరణించిందని నిర్దారించుకున్న తర్వాత చందన చేతి కట్లు విప్పేసి, టేప్ తీసేసి, ఉమర్ తో కలిసి కార్లో హైదరాబాద్ కు వెళ్ళిపోయింది.

చందనను, ఆమె ప్రియుణ్ణి పట్టుకోవడం కోసం టెక్నాలజీ సహాయంతో ప్రయత్నించిన పోలీసులు వారిద్దరినీ ఆర్మూర్ లో పట్టుకున్నట్టు తెలిపారు. వారిద్దరితో పాటు వీరిద్దరికి సహకరించిన ఉమర్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్, సోదరి షేక్ అసియా ఫాతీమా, స్నేహితుడు హఫీజ్ లను కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.